ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియమకానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరిణ కోసం ప్రభుత్వం http://gramavolunteer.ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆసక్తి, అర్హుత కలిగిన అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దాదాపు 2లక్షల మందికి ఉద్యోగం లభించనున్నాయి.
సోమవారం నుంచి దరఖాస్తుకు అవకాశం వాలంటీర్ల భర్తీ కోసం జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. ఈ నెల 24న నోటిఫికేషన్ వెలువడనుండగా.. జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ స్థానికతే ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం వాలంటీర్ల నియామకం చేపట్టనుంది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి, మిగిలిన గ్రామాల్లోని వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు మధ్య వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి జులై 11 నుంచి 25వ తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.